
Pakistans Water Request To India: సింధూ జలాల నిలిపివేతతో పాక్ అల్లకల్లోలం అవుతోంది. సింధు జలాలను పునరుద్ధరించాలని భారత్‌ను విజ్ఞప్తి చేసింది. ఓవైపు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బెదిరింపులకు దిడంతో పాటు, దబ్దాల క్రితం చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంపై పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత నిర్ణయం కారణంగా పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పాకిస్థానీయులంతా ఒక తాటిపైకి రావాలంటూ పిలుపు నిచ్చారు. ఆ మరునాడే.. సింధు జలాలను విడుదల చేయాలంటూ భారత్‌ను పాకిస్థాన్ ప్రాధేయపడింది. ఆదేశం కోర్టు ఎక్కినా భారత్ లైట్ తీసుకుంది.
పాక్ హైకమిషన్‌కు వార్తాపత్రికల నిలిపివేసిత
భారత్-పాక్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దాయాది దేశం చర్చకు ప్రతిగా భారత్ మరో నిర్ణయం తీసుకున్నది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు వార్తాపత్రికల సరఫరాను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు కనీస సౌకర్యాలను పాక్ నిలిపివేసిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రతీకార చర్యలకు దిగుతున్నందున ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిగా భారత అధికారుల పాక్ హైకమిషన్ కు వార్తాపత్రికల సరఫరా నిలిపేశారు.
Read Also: గాజాపై వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీపై ఇజ్రాయెల్ ఆగ్రహం!