Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంAfghan–Pakistan Conflict: పాక్ పై అప్ఘన్ బాంబుల వర్షం, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌...

Afghan–Pakistan Conflict: పాక్ పై అప్ఘన్ బాంబుల వర్షం, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌ తో సహా పలు సైనిక స్థావరాలపై దాడులు!

  • దాడులు మరింత ఉధృతంగా కొనసాగిస్తాం

  • తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘాన్‌ రక్షణ శాఖ వెల్లడి

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ వైమానికదళం పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున రావల్పిండిలోని పాక్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరంపై భారీ దాడులు చేసినట్టు అఫ్ఘాన్‌ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులు ఎంతో సమన్వయంతో, కచ్చితత్వంతో నిర్వహించినట్టు పేర్కొంది.

కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు

రావల్పిండి సమీపంలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌, బలూచిస్థాన్‌లోని క్వెట్టాలో ఉన్న 12వ డివిజన్‌ ప్రధాన కార్యాలయం, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు తాలిబన్‌ నేతృత్వంలోని అఫ్ఘాన్‌ రక్షణ శాఖ తెలిపింది. నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పాకిస్థాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి. గతేడాది ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌ దాడుల వల్ల నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ బాగా దెబ్బతింది. దానికి పాకిస్థాన్‌ మరమ్మతులు చేపడుతోంది.

ఆప్ఘన్ దాడుల వెనుక కారణం ఏంటి?

కాబూల్‌, బాగ్రామ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇటీవల పాక్‌ వైమానిక దాడులకు పాల్పడిందని, దానికి ప్రతీకారంగానే తాము ఈ దాడులు చేశామని అఫ్ఘాన్‌ అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్‌, కాబూల్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగాయి. సరిహద్దుల్లో భద్రతా దళాల మధ్య ఘర్షణలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి పరిస్థితిని బహిరంగ యుద్ధంగా పాక్‌ అభివర్ణించింది.

దాడులపై స్పందించని పాక్ ప్రభుత్వం

పాక్‌లోని కీలక స్థావరాలపై వైమానిక దాడులు చేశామంటూ తాలిబన్లు చేసిన ప్రకటనలపై పాకిస్థాన్‌ ఇంతవరకూ స్పందించలేదు. పాక్‌ అధికారులు ఎవరూ ఈ దాడులను ధ్రువీకరించలేదు. దీంతో ఈ దాడులు జరిగాయా లేదా? వాటివల్ల ఏమైనా నష్టం జరిగిందా? అనేది ఇంకా తెలియదు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments