
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకుగానూ దాదాపుగా 30 మందికిపైగా సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేస్తూ ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఇందులో బాహుబలి మూవీ ఫేమ్ నటుడు మరియు సినీ నిర్మాత రానా దగ్గుబాటి, టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్ అనన్య నాగళ్ళ, నటి మంచు లక్ష్మి, తదితరులతోపాటూ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి, నటి సురేఖవాణి కూతురు సుప్రీత నాయుడు తదితర ఇతరులు ఉన్నారు.
ఐతే ఈరోజు నటి మంచు లక్ష్మి హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఉన్న ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరైంది. ఈడి అధికారులు మంచు లక్ష్మి ని దాదాపుగా 2 గంటలపాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై విచారించినట్లు తెలుస్తోంది. ఐతే ఈడీ విచారణ అనంతరం నటి మంచు లక్ష్మి మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడలేదు. ఐతే గతంలోంచు లక్ష్మి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై స్పందిస్తూ తాము గవర్నమెంట్ అప్రూవల్ చేసిన యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని ఎలాంటి తప్పు చెయ్యలేదని మీడియా ముందు వాపోయింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటుడు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఈడి విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ విచారణ పూర్తవ్వగానే తీర్పు వెలువడనుంది.