Tuesday, March 10, 2026
Homeక్రైమ్ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో హీరో!

ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో హీరో!

సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ ను మాదకద్రవ్యాల కేసులు పోలీసులు అరెస్టు చేశారు. ఓ రాజకీయ నాయకుడి నుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా ఆయనను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఆయన డ్రగ్స్ అమ్మిన మాజీ AIDMK నాయకుడు ప్రసాద్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ అరెస్ట్

నిజానికి తొలుత హీరో శ్రీరామ్ ను పోలీసులు అరెస్టు చేయలేదు.  ముందుగా డ్రగ్స్ అమ్ముతున్నారనే ఆరోపణల నేపథ్యంలో మాజీ డీఎంకే నేత ప్రసాద్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  శ్రీరామ్ ను అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు.. నుంగంబాక్కం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి అక్కడే ఆయనను విచారించారు.  ఆ తర్వాత నిందితులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి రక్త నమూనాలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సౌత్ లో పలు భాషల్లో హీరోగా చేసిన శ్రీరామ్

శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. ఏపీకి చెందిన వ్యక్తి. సినిమాల మీద ఇష్టంతో ఆయన చెన్నైకి వెళ్లాడు. ఆ తర్వాత తన పేరును శ్రీరామ్ గా మార్చుకున్నాడు. తమిళ సినిమా ‘రోజా కూటం’తో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘రోజా పూలు’ పేరుతో విడుదల అయ్యింది. ఆ తర్వాత ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ఒకరికి ఒకరు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను మరింత దగ్గరయ్యాడు. రీసెంట్ గా ‘హరికథ’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా శ్రీరామ్ అరెస్ట్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో అందరూ షాకయ్యారు.

Read Also: పెళ్లి చేసుకున్న నెలకే భర్తను చంపి ప్రియుడితో జంప్

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments