
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- నటుడు సోను సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై సోను సూద్ స్పందించారు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అబద్ధమని సోను సూద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ అంశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు అని అన్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్ ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు విపరీతంగా వాడుతున్నారని మండిపడ్డారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోబోతున్నామని సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ పెట్టారు.
ఇంకోసారి కుల మత ద్వేషాలను రెచ్చగొడితే ఊరుకోను!.. రాహుల్ గాంధీకి వార్నింగ్ ఇచ్చిన మోడీ?
కాగా ఎంతో మంది పేద ప్రజలకు సోను సూద్ సహాయం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం కరోనా సమయంలోను సోను సూద్ ఎంతోమందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలబడ్డారు. సినిమాలలోని విలన్… నిజజీవితంలో అసలు సిసలైన హీరోని చాలామంది పొగిడారు కూడా. కానీ సోను సూదిపై చాలామంది ఇష్టం వచ్చినట్లు పోస్ట్లు పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్!… అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు??