
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- బిఆర్ఎస్ ప్రభుత్వంలో సిసి రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్న శిలాఫలకాలను ధ్వంసం చేయడంపై మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం మండిపడ్డారు. మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో శిలాఫలకాలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మునుగోడు పోలీస్ స్టేషన్లో ఎస్సై ఇరుగు రవికుమార్ కు ఫిర్యాదు చేశారు. అబివృద్ధి చేసిన పనుల శిలాఫలకాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యగా భావించాలి అని,సత్వరమే విచారణ జరిపి , కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎంపిటిసి పోలగొండ్ సైదులు గౌడ్, కొరటికల్ మాజీ ఉపసర్పంచ్ ఎల్లంకి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు అయితగోని శేఖర్, మారగొని అంజయ్య గౌడ్, ఈద శరత్ బాబు,,అయితగోని విజయ్, దోటి కర్ణాకర్, బేరీ గురుపాదం,పర్వతాలు,నాయకులు పాల్గొన్నారు.
Read also : క్షణం గ్యాప్ లేకుండా వర్షాలే వర్షాలు.. బతుకమ్మకు అడ్డంకయ్యేనా?
Read also : నేడే తెలంగాణలో లిక్కర్ షాప్ దరఖాస్తుల స్వీకరణ!