
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కారు పార్టీలో కలహాలు… కాక రేపుతున్నాయి. సొంత కూతురే.. తిరుగుబావుటా ఎగరేసింది. పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. మరి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏం చేయాలి…? కూతరు కాకపోయింటే.. వెంటనే చర్యలు తీసుకునేవారు. కానీ.. ఇక్కడ కన్న కూతురు అయిపోయింది. అందుకే వెనకా ముందు ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. పైగా పార్టీ భవిష్యత్ గురించి కూడా.. కేసీఆర్ ఆలోచించాల్సి ఉంది. అందుకే.. కవితకు షోకాజ్ నోటీసులు ఇస్తారని.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ.. అలా జరగలేదు. అంటే.. కవిత విషయంలో గులాబీ పార్టీ దూకుడుగా వెళ్లడంలేదు. ఆచీ తూచీ అడుగులు వేస్తోంది. పార్టీనే కాదు… ఇది కుటుంబ విషయం కూడా కావడంతో… ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఆమెపై చర్యలు తీసుకోలేదని సమాచారం.
కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న ఆమె మాట.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.. ఆ తర్వాత బీఆర్‌ఎస్-బీజేపీ విలానానికి ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె చెప్పారు. దీంతో.. విషయం మరింత వేడెక్కింది. కవిత మరింత దూకుడుగా వెళ్లకముందే… ఆమెకు కళ్లెం వేయాలని బీఆర్‌ఎస్ పార్టీలోని ఓ వర్గం పట్టుబడుతోంది. కానీ.. మరో వర్గం అలాంటి పని చేయొద్దని.. తొందరపడొద్దని వారిస్తోంది. సొంత మనిషిని పార్టీ నుంచి పంపేయడం సరికాదన్నది వారి వాదన. దీంతో.. కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న నిర్ణయం వాయిదా పడింది.
బీఆర్‌ఎస్ పార్టీ నేత బోయినపల్లి వినోద్‌కుమార్.. కవిత విషయంలో పార్టీ స్టాండ్‌ను చెప్పకనే చెప్పారు. చిన్న చిన్న కుటుంబాల్లోనే గొడవలు కామన్. రాజకీయాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఆధిపత్య పోరు సహజమే. ఇలాంటివి అన్ని పార్టీల్లోనూ ఉంటాయని వినోద్ అన్నారు. అంతేకాదు త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కూడా చెప్పారాయన. కవితకు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. ఆమె మీడియా ముందు… బీఆర్‌ఎస్-బీజేపీ విలీనం గురించి మాట్లాడలేదని.. చిట్‌చాట్‌లో మాత్రమే అన్నారని చెప్పారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన దానికి.. షోకాజ్ నోటీసులు ఇవ్వలేమని చెప్పారు వినోద్. పైగా.. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసిందన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే వినోద్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు సమచారం. అంటే… కవిత విషయంలో ఇప్పుడు.. ఎలాంటి చర్యలు వద్దని.. బీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.