
అచ్చంపేట, (క్రైమ్ మిర్రర్): కృష్ణా నదిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణానికి సహకరించాలని తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు.
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడానికి వచ్చిన ఎపి సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే వంశీకృష్ణ డ్యాం పై కలుసుకుని, మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణంపై వినతిపత్రం అందజేశారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి ఏపీ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, వంతెన నిర్మాణం పూర్తయితే దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గి, ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు.
కృష్ణా నదిపై ఈ వంతెన పూర్తయితే రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుందని, వ్యాపార-వాణిజ్య లావాదేవీలు కూడా వేగంగా జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.