
రేగొండ,క్రైమ్ మిర్రర్:-రేగొండ మండలంలోని తిరుమల గిరి గ్రామ శివారు బుగులోని గుట్టల వద్ద ఈ నెల 10 న కొంపల్లి గ్రామానికి చెందిన రవి హత్య కేసులో నిందితులైన ఆరుగురిని గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డిఏస్పీ సంపత్ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం రేగొండ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సంపత్ రావు,రవి హత్య కేసు వివరాలు వెల్లడించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ తో రవి అక్రమ సంబంధం ఏర్పర్చుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.కాగా కొంత కాలంగా రేణుకను అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో వేదించడం శారీరకంగా హింసించడం చేస్తు ఉండే వాడని ఈ విషయం పై పలు మార్లు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికి రవి ప్రవర్తన లో మార్పు రాకపోవడంతో రేణుక ఆమె కొడుకు శ్రీకర్, కొంపల్లి గ్రామస్తుడు శ్రీపాల్ ముగ్గురు కలిసి రవిని హత్య చేయాలనీ పథకం పన్నారు.
ఈ పథకంలో భాగంగా శ్రీకర్ హనుమకొండకు చెందిన బొమ్మ కంటే ఉదయ్ చందన్ ను సంప్రదించి రవిని హత్య చేయడానికి సహాయం కోరాడు. ఉదయ్ చందర్ తన బంధువులైన సందీప్ నరేష్ లను సంప్రదించి 1,50,000 ఒప్పందం కుదుర్చుకున్నారు.శ్రీ పాల్ ఈ ఒప్పందంలో ఆర్థిక సహాయం అందించాడు.మొదట రూ.25 వేలు నగదు తర్వాత రూ.14000, రూ.3000,రూ.10000 గూగుల్ పే ద్వారా ఉదయకు అందించారు. రవిని హత్య చేసేందుకు హన్మకొండలో సురేష్ కు చెందిన మారుతి సుజుకి డిజైర్ కారు అద్దెకు తీసుకొని హత్య చేయడానికి తిరుమలగిరి గ్రామా శివారులోని పాండవుల గుట్టల్లో రవిని హత్య చేసేందుకు పాతపల్లి శ్రీకర్, కొంపల్లి, బొమ్మకంటి ఉదయ్ రేగొండ మండలం దమ్మన్నపేట పసుల సందీప్, దమ్మన్నపేట ములుగురి నరేష్ దమ్మన్నపేట, కాయిత శ్రీపాల్ కొంపల్లి, పాతపల్లి రేణుక, ఆరుగురు పథకం ప్రకారం రవిని కారులో ఎక్కించుకొని నీ మొదటి భార్య కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తామనీ నమ్మించి కొంపల్లి శివారు లోని వైన్ షాప్ వద్ద మద్యం సేవించి నిందితులు తాగినట్టు నటిస్తూ అర్ధరాత్రి తిరుమల గిరి బుగులోని గుట్టల వద్ద రవిని తాడుతో ఊరి వేసి ఊపిరాడాకుండ చేసి హత్య చేశారు. శవాన్ని చెట్ల పొదల్లో విసిరేసి రవి జేబులో ఇరవై వేల రూపాయలు తీసుకోని హత్యకు ఉపయోగించిన తాడు గద్దెల వద్ద పడేసి వెళ్లారని తెలిపారు. రవి హత్య అనంతరం మొదటి భార్య బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు హన్మకొండ లో తలదాచుకున్నారనీ బుధవారం రేగొండ ఎసై సందీప్ కుమార్ సిబ్బంది తో కలిసి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని శ్రీకర్ సెల్ ఫోన్లోని ఫొటోలు ఆధారాలు స్వాధీనం చేసుకొని శ్రీకర్ వాగ్మూలం ఆధారంగా హత్య జరిగిన స్థలం నుండి తాడు వివరాలు సేకరించమని వివరించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్,రేగొండ ఎస్సై ఎన్.సందీప్ కుమార్,రెండవ ఎస్సై మహమ్మద్ షా ఖాన్,ఉమెన్ ఎస్సై దివ్య, పోలీస్ సిబ్బంది లింగమూర్తి గౌడ్, సట్ల ప్రవీణ్ కుమార్, మహేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలతో పాక్ లో 116 మంది మృతి, అమెరికాలో జల విలయం!