
మంచిర్యాల,క్రైమ్ మిర్రర్:- గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, మంచిర్యాల శాఖకు చెందిన ఖాతాదారు దొరిశెట్టి రాజయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన పేరిట గల గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాకు అనుబంధంగా ఉన్న ప్రమాదభీమా సౌకర్యం ద్వారా ఆయన భార్య దొరిశెట్టి అరుణ కి రూ.1 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ చెక్కును శ్రీరాంపూర్ ఎస్సై మేకల సంతోష్ చేతుల మీదుగా మృతుడి భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి బ్యాంకు బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్, జూనియర్ ఆఫీసర్ ఎల్లందుల శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు 10.50 శాతం ప్రీమియం చొప్పున వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే మంచిర్యాల పరిసర గ్రామాలలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించడం ద్వారా పెన్షనర్లు, ఇతర ఖాతాదారులు సులభంగా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేలా చేసినందుకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
Read also : సంక్రాంతి బరిలో పెద్ద, చిన్న హీరోలు.. మరి విన్నర్ ఎవరో?
అనంతరం బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్ మాట్లాడుతూ, 24 గంటలపాటు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచడం ద్వారా మంచిర్యాలతో పాటు పరిసర ప్రాంత ప్రజల నగదు అవసరాలను తీర్చుతున్నామని తెలిపారు. అలాగే బంగారు ఆభరణాలపై గ్రాముకు గరిష్ఠంగా రూ.8,600 వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామని అన్నారు. సేవింగ్ ఖాతాల ప్రారంభానికి అవసరమైన ఫోటోలు, జిరాక్స్‌లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపారస్తులకు,వ్యాపార వృద్ధికి రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్రాలు, పోస్టాఫీస్ డిపాజిట్లపై కేవలం 0.83 పైసల వడ్డీతో (సుమారు 10 శాతం పీఏ రేటుకు) రుణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదుపాయాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ కోరారు.
Read also : విజయ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న రింకూ సింగ్?





