బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా ఉన్న ఫార్మూలా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు గ్రీన్ కో డైరెక్టర్లు.ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రమోటర్స్ గా గ్రీన్ కో,కో పార్ట్నర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థలు ఉన్నాయి.
గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయాల్లో సోదాల అనంతరం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది ఏసీబీ. దీంతో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్లు అనిల్ చలమల శెట్టి , హరీష్ కొల్లి. విచారణకు హాజరయ్యే ముందు ఫార్ములా ఈ కార్ రేస్ లో చేసుకున్న అగ్రిమెంట్స్ సహా ఇతర డాక్యూ మెంట్స్ తీసుకురావాలని తెలిపింది ఏసీబీ.2022 అక్టోబర్ లో తొలిసారి వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు ఈ కార్ రేస్ కు ప్రమోటర్స్ గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాయి. గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్..
2023 లో మొదటి సారి జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్ ను మాత్రమే ప్రమోట్ చేసి అనంతరం తరువాత సీజన్ కు తప్పుకుంది గ్రీన్ కో. అగ్రిమెంట్ ఉల్లంఘనపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది. అగ్రిమెంట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు అని అడగడంతో పాటు..తప్పుకునే సమయంలో HMDA కు వివరణ ఇచ్చారా అని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కు ప్రమోటర్ గా ఎలా ఛాన్స్ దక్కింది అనే విషయాలు అడగనున్నారు ఏసీబీ అధికారులు.