
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు సంబంధించి నేడు 2025 – 2026 అకాడమిక్ క్యాలెండర్ ను అధికారులు విడుదల చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అకడమిక్ క్యాలెండర్ లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇక మొత్తంగా సంవత్సరంలో భాగంగా 226 పని దినాలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు ఉండనున్నాయి. ఇక అలాగే 2026 జనవరి నెలలో 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. జనవరి లాస్ట్ వీక్ లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు… అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఆ తరువాత మార్చి ఫస్ట్ వీక్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మార్చి 31న చివరి వర్కింగ్ డే గా జూనియర్ కళాశాలలకు అకాడమిక్ క్యాలెండర్ ద్వారా అధికారులు వెల్లడించారు. కాబట్టి ఈ రెండు సంవత్సరాల అకడమిక్ క్యాలెండరు ద్వారానే సెలవులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కాగా రాష్ట్రంలోని విద్యార్థులకు మే నెల వరకు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఈ క్యాలెండర్ ద్వారా కొన్ని అధికారిక సెలవులు కూడా ఉన్నాయి.. అవి త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలియజేశారు.