
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- లింగ రూపంలో కొలువైన గరలకంఠ శివుడిని దర్శించుకుని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తుంటారు భక్తులు. బుధవారం ఉదయం ఉమ్మడి మహాదేవపూర్ మండలంలోని పంకెన సమీపంలోని అరణ్యంలో గరికపాడు స్వయంబు శివలింగానికి సూరారం గ్రామానికి చెందిన నలుమాసుల శివయ్య ఆధ్వర్యంలో అదే గ్రామానికి చెందిన చీర్ల మానస అరుణ్ దంపతులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా నలుమూసుల శివయ్య మాట్లాడుతూ… శివ లింగానికి దంపతులు కలిసి అభిషేకం చేయడం వల్ల సంతానం, సంపద, ఆరోగ్యం, సకల అభీష్టాలు నెరవేరతాయి అని ముఖ్యంగా పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది, పాలతో ఆయుర్దాయం పెరుగుతుంది, నేతితో మోక్షం, చెరకు రసంతో ఆర్థిక సమస్యల పరిష్కారం వంటివి లభిస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి, నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చెరకు రసం, పంచామృతం వంటివాటితో అభిషేకం చేయవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరారం గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read also : మైలార్‌దేవ్‌పల్లి సీఐ సత్యనారాయణను సన్మానించిన బీఆర్‌ఎస్ నాయకులు





