
Abhishek Sharma: భారత క్రికెట్ అభిమానులకు అభిషేక్ శర్మ పేరు వినిపిస్తే చాలు.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే విధ్వంసమే గుర్తుకు వస్తుంది. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ యువ ఓపెనర్, పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదంగా మారిపోయాడు. వరల్డ్ కప్ విజేత యువరాజ్ సింగ్ చేతుల్లో శిక్షణ పొందిన అభిషేక్ శర్మ.. ఆ గురువు స్టైల్‌ను తన ఆటలో అద్భుతంగా మేళవిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం ఇతడికి బంతి వేయాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
మైదానంలో సిక్సర్లతో విధ్వంసం సృష్టించే అభిషేక్ శర్మ.. ఇప్పుడు మైదానం బయట కూడా అదే స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా అతడు కనిపించిన న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ షర్ట్‌లో, క్యూట్ అండ్ స్టైలిష్ గెటప్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. క్రికెటర్‌గా మాత్రమే కాదు, లుక్ పరంగానూ ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ కొత్త లుక్‌లో అభిషేక్ మెడలో స్టైలిష్ చైన్, ట్రెండీ హెయిర్ స్టైల్‌తో మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. సాధారణంగా సింపుల్ లుక్‌కే పరిమితమయ్యే అభిషేక్, ఈసారి మాత్రం ఫుల్ స్టైల్ మోడ్‌లో దర్శనమివ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఫోటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
సిక్సులు, బౌండరీలతో స్టేడియాలను ఊపేసే అభిషేక్ శర్మ ఇప్పుడు బాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే క్రికెట్‌తో పాటు సినిమా రంగంలో కూడా ట్రై చేస్తే సూపర్ హిట్ అవుతాడని సరదాగా అభిప్రాయపడుతున్నారు. ఇది అభిషేక్ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణగా మారింది.
ఇక ఆట విషయానికి వస్తే.. అభిషేక్ శర్మ ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదడం ద్వారా తన బ్యాటింగ్ పవర్‌ను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆ ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాచును పూర్తిగా తనవైపు తిప్పేశాడు.
యువరాజ్ సింగ్ శిష్యుడిగా అభిషేక్ శర్మలో ఆ దూకుడు, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైదానంలో విధ్వంసం, మైదానం బయట స్టైల్.. ఈ రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ అభిషేక్ శర్మ అభిమానులను అలరిస్తున్నాడు. రాబోయే రోజుల్లో అతడి ఆటతో పాటు, అతడి పర్సనాలిటీ కూడా యువతకు మరింత ఇన్‌స్పిరేషన్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ: Arijit Singh: ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన బాలీవుడ్ సింగర్





