
Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యాయి. విమాన ప్రమాదం జరిగిన నెల రోజులకు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంజిన్ ఫ్యూయెల్ కంట్రోలర్ స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.
ప్రమాదానికి కారణం ఏంటంటే?
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా అయ్యే కంట్రోల్ స్విచ్ లు ఆఫ్ అయినట్లు పైలెట్లు గుర్తించారు. ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని ఓ పైలెట్ అడగడంతో మరో పైలెట్ నేనే చేయలేదని చెప్పినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. వెంటనే ఫ్యూయెల్ కంట్రోల్ స్విచ్ లు ఆన్ చేసినప్పటికీ, విమానం వేగాన్ని అందుకోలేక కింద పడిపోయినట్లు తెలిపింది. విమానం కూలిపోయే ముందు పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) స్పందించినప్పటికీ పైలెట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు. అప్పటికే విమానం కూలిపోయిందన్నారు. విమానం కూలిపోయే సమయంలో 180 నాట్స్ వేగంతో ఉన్నట్లు వెల్లడించారు. ఫ్యూయెల్ స్విచ్‌లను ఆపివేయడంతో వేగం, ఎత్తులో వేగంగా మార్పులు చోటుచేసుకుని కూలిపోయినట్లు తెలిపారు.
విమానంలోని 241 మంది మృతి
అటు ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది దుర్మరణం చెందారు. మొత్తం 242 మంది ఉండగా, ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయపడ్డారు. మిగతా వాళ్లు మెడికల్ కాలేజీ సిబ్బంది ఉన్నారు. మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Also: వరుసగా రెండో రోజు.. ఢిల్లీని వణికించిన భూ ప్రకంపనలు!