జాతీయం

అద్భుత వారధి.. చూస్తే వాహ్వా అనాల్సిందే - పంబన్‌ బ్రిడ్జ్‌ విశేషాలు ఇవే..!

చుట్టూ సముద్రం… మధ్యన బ్రిడ్జ్‌. ఆ వంతెనపై వెళ్లే రైళ్లను తాకుతూ.. అలలు చేసే సవ్వడి. ఆ ప్రయాణం.. ఒక మధురానుభూతి. ఆ అనుభూతిని పొందాలంటే… పంబన్‌ బ్రిడ్జ్‌పై ప్రయాణం చేయాల్సిందే. తమిళనాడులోని రామేశ్వరానికి వెళ్లే రైళ్లు… పంబన్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తాయి. పంబన్‌ రైల్వే బ్రిడ్జిని 1914లో బ్రిటీష్‌ కాలంలో నిర్మించారు. ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో… భారత రైల్వే కొత్త వంతెనను నిర్మించింది. శ్రీరామనవమి సందర్భంగా.. ఆ బ్రిడ్జిని ప్రధాని మోడీ ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన పంబన్‌ బ్రిడ్జ్‌ విశేషాలు ఒకసారి చూద్దాం.

పంబన్‌ బ్రిడ్జ్‌… ఇదో ఇంజనీరింగ్‌ అద్భుతం. దేశంలోనే మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ-బ్రిడ్జ్‌. అంటే సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్‌. సముద్రంలో ఓడలు ప్రయాణించే సమయంలో అడ్డుతొలగి.. వాటికి దారి ఇస్తుంది. ఆ సమయంలో సముద్రమట్టానికి సమాంతరంగా.. నిట్ట నిలువుగా పైకి వెళ్తుంది ఈ బ్రిడ్జ్‌. దాని కింద ఓడలు వెళ్లిపోతాయి. ఆ తర్వాత బ్రిడ్జ్‌ యథాస్థితి వచ్చేస్తుంది. మన దేశంలో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కట్టిన తొలి బ్రిడ్జ్‌ ఇదే. అయితే… ప్రపంచంలో ఇలాంటి బ్రిడ్జ్‌లు చాలానే ఉన్నాయి.


Also Read : సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ మధ్య వాగ్వాదం – అసలు ఏం జరిగిందంటే..?


ఇవి కాక… బాస్క్యూల్‌ టెక్నాలజీతో కట్టిన వంతెనలు కూడా ఉన్నాయి. బాస్క్యూల్‌ టెక్నాలజీలో అయితే… ఓడలు వెళ్లేందుకు అనుకూలంగా బ్రిడ్జ్‌ నిట్ట నిలువుగా చీలిపోతుంది. ఆ సమయంలో… ఎంత పెద్ద ఓడలైనా వెళ్లిపోవచ్చు. కానీ.. వర్టికల్‌ బ్రిడ్జ్‌లో ఆ సదుపాయం ఉండదు. బ్రిడ్జ్‌ పైకి లేచినప్పుడు… ఆ బ్రిడ్జ్‌ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఓడలు వెళ్లలేవు. బ్రిడ్జ్‌ కంటే తక్కువ ఎత్తులో ఉన్న ఓడలే వెళ్లగలుగుతాయి. పంబన్‌ బ్రిడ్జ్‌ నిర్మించిన ప్రదేశంలో… భారీ ఓడల రవాణా లేదు. కనుక… వర్టికల్‌ బ్రిడ్జ్ సూటవుతుందని నిపుణులు తేల్చారు.


Also Read : జమిలీ కుదరకపోతే మినీ జమిలీ – బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌..!


పంబన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి 2019 మార్చిలో కన్యాకుమారిలో శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించగా… ఇప్పుడు బ్రిడ్జ్‌ అందుబాటులోకి వచ్చింది. పంబన్‌ బ్రిడ్జ్‌ పొడవు 2.2 కిలోమీటర్లు. సముద్రమట్టానికి 22 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రైల్వే నియంత్రణ వ్యవస్థకు అనుసంధానమైన ఎలక్ట్రో-మెకానికల్‌ సిస్టమ్‌ వంతెనను నియంత్రిస్తుంది. రైళ్ల రాకపోకల సమయంలో.. వంతెన లిఫ్ట్‌ అయ్యేలా.. టెక్నాలజీ ఉపయోగించారు. దీని వల్ల ఓడలు వేగంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం 535 కోట్లు ఖర్చు చేశారు. తమిళనాడు రామసేతు చాలా ప్రసిద్ధి. ఇప్పుడు పంబన్‌ బ్రిడ్జ్‌కు తమిళనాడు మరో ఆకర్షణగా నిలవనుంది.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button