
హత్నూర, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ఏప్రిల్ 27::- సంగారెడ్డి జిల్లా హత్నూర లొ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు తొ వేగంగా బైక్ ను డి కొనడంతో అమృత అనే మహిళ (45) మృతి చెందిందనట్లు స్థానికులు తెలిపారు. ఈమె చిలిపిచెడు మండలం అజ్జమరి గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ముగ్గురికి గాయాలు కాగ ఒక మహిళా కాలు ఇరిగింది. చిన్న పాప చెయ్యి విరిగింది. క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు లొ తరలించారు. నర్సాపూర్ నుండి అతివేగంగా వచ్చిన కారు హత్నూర నుండి దౌల్తాబాద్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కారు బైక్ పై ఉన్న వారిని రోడ్డు పక్కన గుంతలోకి 60 మీటర్ల వరకు కార్ తోపాటు ఈడ్చుకెల్లడంతొ మహిళా అక్కడిక్కడే మృతి చెందింది. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.