
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- ప్రధాన పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులకు దీటుగా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి గుజ్జుల లావణ్య శంకర్ ఘనవిజయం సాధించారు. ఈ అపూర్వ విజయం యువ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్ని నింపనుంది. గుజ్జుల లావణ్య శంకర్ విజయంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గుజ్జుల లావణ్య శంకర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
Read also : Nitin Gadkari: రహదారి మరణాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం, రాష్ట్రాలకు అత్యాధునిక అంబులెన్సులు!
Read also :Pollution Crisis: ఆ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్, డీజిల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!





