
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పైగా మాజీ మంత్రి… ఈ క్వాలిఫికేషన్స్ చాలు… కూటమి ప్రభుత్వంలో జైలుకు వెళ్లాలంటే… ఇది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. విడదల రజినీ విషయంలోనూ అదే జరుగబోతోందని ఆరోపిస్తున్నారు. నిజమేనా.. వైసీపీ నేతలు ఆరోపించినట్టే జరుగుతోందా..? ఏమో గానీ… విడదల రజని చుట్టూ మాత్రం ఉచ్చు బిగుసుకుంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో ఇప్పటికే ఆమె మరిది, పీఏను అరెస్ట్ చేశారు పోలీసులు. నేడో రేపో విడుదల రజనీని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
అసలు ఏం జరిగిందంటే… 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు విడదల రజని. జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆరోపణ. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 10నెలల తర్వాత… స్టోన్ క్రషర్ యజమానికి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ కేసులో.. ఏ-1గా విడదల రజిని, ఏ-2గా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, ఏ-3గా విడదల రజనీ మరిది గోపీనాథ్ ఉన్నారు. వీరంతా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే విడదల రజినీ పీఏ శ్రీకాంత్‌రెడ్డి, మరిది గోపీనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విడదల రజినీ కూడా నేడో రేపో ఆరెస్ట్ చేయొచ్చని సమాచారం.
విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న కూటమి ప్రభుత్వం. విడదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో… ఆమె వ్యవహారాలన్నీ మరిది గోపీనాథ్ చూసుకున్నాడు. దీంతో… ముందుగా ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో గోపీనాథ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. విడదల రజినీ పీఏ శ్రీకాంత్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారం. వీరిద్దరి అరెస్ట్ తర్వాత… ఏం జరుగుతుందో అందరూ ఈజీగానే గెస్ చేయొచ్చు. ఈ కేసులో నెక్ట్స్ టార్గెట్ విడుదల రజినీనే… కదూ..!