
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:- భారీ వర్షాలు కెన్యాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కెన్యాలో కురిసిన భారీ వర్షాలకు రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు కొండ చర్యల మధ్య ఇరుక్కుపోయి కనిపించకుండా పోయారు. ఇప్పటికే ఈ కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అధికారుల చొరవతో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మృతి చెందిన వారితోపాటు గల్లంతయిన వ్యక్తులను బయటకు తీయడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కెన్యాలోని పలు రోడ్లు వరదలు కారణంగా కొట్టుకుపోయాయని అక్కడ అధికారులు ప్రాథమికంగా సమాచారాన్ని అందజేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోగా చాలానే ఇల్లు ధ్వంసం అవడంతో పాటు భారీగా ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడ అధికారులు వెల్లడించారు. దీంతో కెన్యాలోని ఈ రిఫ్ట్ వ్యాలీ ప్రదేశంలో గందరగోళపు పరిస్థితులు ఏర్పడ్డాయి. మృతి చెందిన కుటుంబాల ఆర్ధనాధాలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు తెప్పిస్తుంది. ఇప్పటికే 21 మంది ప్రాణాలు కోల్పోగా ఆసంకి మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రెస్క్యూ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రాణనష్టం జరగకుండా చూస్తున్నారు. ఇక కెన్యాలో ఇటువంటి కొండ చర్యలు విరిగిపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న.. ఇంత ప్రాణనాష్టమైతే జరగలేదు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు అధికారులను వేడుకుంటున్నాయి.
Read also : ఈ రోజైనా గెలుస్తారా.. టీమిండియాకు ఏం తక్కువయింది?
Read also : మరో మూడు రోజులపాటు ఏపీకి పొంచి ఉన్న వర్షపు ముప్పు!





