రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్ ఫుర్ లో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు అలాగే ముగ్గురు బాలికలు ఇద్దరు పెద్దవాళ్లు చనిపోయారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం స్లీపర్ కోచ్ బస్సు అలాగే టెంపో ను ఢీకొట్టగా ఈ ప్రమాదంలో ఏకంగా 11 మంది మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ లోని బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH 11B లోని సునిపూర్ గ్రామ పరిధిలో ఈ ప్రమాదం అనేది జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ కూడా బారి నగరంలోని గుమత్ మొహాల్ల గ్రామం నివాసితులు. వీరంతా కూడా వాళ్ళ బంధువుల కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 11 మంది చనిపోగా మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే చనిపోయిన వారందరి మృతదేహాలను కూడా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదం సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..