తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కూడా విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఫుట్ పాయిజన్ కారణంగా చాలామంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో ఉన్న ఏకశిల కాలేజీ వద్ద జరిగింది.
ఈ ఏడాది మరణించిన మహానుభావులు వీరే!
హనుమకొండ లోని ఏకశిలా కాలేజీలో చదువుతున్నటువంటి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) అనే బాలిక నిన్న అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం సంచలనంగా మారింది. శ్రీదేవి అనే పదహారేళ్ల బాలిక అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావించారు. కానీ ఖచ్చితంగా యాజమాన్యమే కారణం అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని తప్పకుండా విచారిస్తామని తెలిపారు.
అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి!సీసీ కెమెగా ఫుటేజీలో సంచలన నిజాలు
అయితే రాష్ట్రంలో ఈ మధ్య చాలానే సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలోని చాలా విద్యాసంస్థల్లో ఒకవైపు ఫుడ్ పాయిజన్లు, మరోవైపు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆహారం పట్ల అలాగే విద్యార్థుల్లో చైతన్యం పట్ల జాగ్రత్త వహించాలని కొంతమంది కోరుతున్నారు.