త్వరలో జరగబోయేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీడియో కథనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా విఫలమైన విషయం మనందరికీ తెలిసిందే. దానికి తోడుగా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా ఫిబ్రవరి నెలలో జరగబోయేటువంటి చాంపియన్స్ ట్రోఫీని గెలవాలని చెప్పి కసితో ఉండగా టీమిండియా స్టార్ బౌలర్ జట్టును వీడే అవకాశాలు ఉన్నాయని న్యూస్ చెక్కర్లు కొడుతుంది.
మద్యం తాగుతున్నారా!… క్యాన్సర్ ముప్పు ఎదుర్కోవాల్సిందే?
జస్ప్రిత్ బుమ్రా బి జి టి టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదవ టెస్టు మ్యాచ్లో వెన్నులో వాపు కారణంగా అర్ధాంతరంగా మ్యాచ్ మధ్యలోనే ఆసుపత్రికి వెళ్ళిన విషయం మనందరికి తెలిసిందే. కాగా తాజాగా ఈ గాయం కారణంగానే బుమ్రా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లన్ని కూడా మిస్ కావచ్చని సమాచారం అందింది. అతడి ఫిట్నెస్ విషయంలో మల్లగుల్లాల కారణంగానే జట్టును ప్రకటించేందుకు ఐసీసీని బీసీసీఐ మరింత సమయం అడిగినట్లుగా బోర్డు వర్గాలు తెలియజేశాయి.
సమంతకు మరో వ్యాధి!… చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్?
కాగా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే స్టార్ బౌలర్ అయినటువంటి బుమ్రా మన ఇండియా జట్టులో లేకపోతే మాత్రం అది ఇండియాకి కష్టంగా మారవచ్చు. విఫలాలను చవిచూస్తున్న టీమిండియా రేపు జరగబోయేటువంటి ఛాంపియన్షిప్ ట్రోఫీలో బుమ్రా లేకపోతే మాత్రం అది ఇండియా మీద తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. ఎలాగైనా బుమ్రా కోలుకుని ఇండియా టీం తరఫున ఆడాలని ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా తెగ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు ఇండియా స్టార్ బౌలర్ షమీ కూడా గాయం కారణంగా టీమిండియా తరఫున ఆడ లేకపోతున్నాడు.