బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగినటువంటి దాడి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా పోలీసులు నిందితుడిది భారతదేశం కాదని బంగ్లాదేశ్ పౌరుడని తెలిపారు. అంతేకాకుండా అతని పూర్తి పేరు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ అని తెలిపారు. ఇతని వయసు 30 సంవత్సరాలు అని చెప్పుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి పూర్తి వివరాలను పోలీసులు ఎంక్వయిరీ చేయగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా నిందితుడిది బంగ్లాదేశ్ అని పోలీసులు తేల్చడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు భారతదేశ పౌరుడని నిరూపించుకోవడానికి అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ముంబై పోలీసులు తేల్చి చెప్పారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి చొరబడి విజయ్ దాస్ గా పేరు మార్చుకొని భారత దేశంలో జీవనం సాగిస్తున్నాడని ముంబై పోలీసులు తెలిపారు. కేవలం దొంగతనం చేయడానికి మాత్రమే బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లాడని, అక్కడ అనుకోకుండా నిందితుడు సైఫ్ అలీ ఖాన్ అడ్డు రావడంతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
1.అమరావతిలో అమిత్ షా.. పవన్, బండితో స్పెషల్ మీటింగ్!
2.ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!!