Homeక్రైమ్భీమవరంలో గొర్రెల కాపరి దారుణ హత్య...!

భీమవరంలో గొర్రెల కాపరి దారుణ హత్య…!

  • రాత్రి కాపలాగా నిద్రిస్తుండగా వృద్ధ కాపరి హత్య

  • తెలియని దుండగుల దాడి… నల్గొండ జిల్లాలో సంచలనం

  • మర్మంగా మారిన హత్య కేసు…!

  • ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, కేతపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కలం చర్ల జానయ్య (65)ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

స్థానికుల సమాచారం ప్రకారం, జానయ్య ప్రతిరోజు లాగే రాత్రి తన గొర్రెల దొడ్డిలో కాపలాగా నిద్రిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెళ్లి చూసినప్పుడు ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా గుర్తించారు.

గుర్తుతెలియని దుండగులు జానయ్య పై దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన వెనుక పాత వైరం లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలో ప్రజలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు