
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత కాలంలో మహిళలు ఉద్యోగం చేయడానికి ముందడుగు వేస్తూ పలు రకాల రంగాలలో రాణిస్తూ ఉన్నారు. సాధారణంగా స్త్రీ జీవితంలో గర్భం దాల్చడం అనేది ఒక ముఖ్యమైన గొప్ప అనుభూతి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో రెస్ట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాంటి సందర్భంలోనూ కొంతమంది ఉద్యోగం పోతుందేమో అని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. అయితే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా చాలామంది మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారు. తమ కంపెనీ లాభాలను చూసుకుంటున్నారే కానీ ఉద్యోగుల కష్ట సుఖాలను దేవుడు ఎరుగు.. కనీసం ఆరోగ్య విషయాన్ని కూడా గమనించట్లేదు అని చాలామంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా అలాంటి టాక్సిక్ వర్క్ కల్చర్ లో ఇబ్బంది పడుతున్న 28 వారాల గర్భంతో ఉన్న బ్యాంకు ఉద్యోగిని చేసిన పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 28 వారాల గర్భంతో ఉన్న మహిళ కూడా ఉద్యోగం చేస్తూ ఉండగా అనారోగ్యానికి గురై ఒక్కసారి గా 103°F జ్వరం రావడంతో మేనేజర్ ను సెలవు ఇవ్వాలని కోరగా అతను ఇవ్వను అని చెప్పడం మాత్రమే కాకుండా లీవ్ అడగడంతో ఫోన్ చేసి మరి తిట్టారు అని ఆమె సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మేనేజర్లు మరీ ఇంతలా అర్థంపర్థం లేకుండా వ్యవహరిస్తున్నారా అని.. నెటిజనులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : ఊరి రూపురేఖలను మార్చడానికి సర్పంచ్ గా మారిన 22 ఏళ్ల అమ్మాయి!
Read also : హైదరాబాద్ మెట్రో @ 8





