Friday, March 13, 2026
Homeతెలంగాణరేవంత్‌కు షాక్‌ ఇచ్చే ఎమ్మెల్యేల రహస్య భేటీ..

రేవంత్‌కు షాక్‌ ఇచ్చే ఎమ్మెల్యేల రహస్య భేటీ..

హైదరాబాద్‌, (క్రైమ్ మిర్రర్‌): తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌కు చెందిన మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ గోప్యమైన సమావేశంలో కవ్వంపల్లి సముద్రాల, లక్ష్మీకాంత్ రావు, లక్ష్మణ్, సామెల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మాదిగలకు రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సిందే అన్న డిమాండ్‌పై చర్చ జరగినట్టు సమాచారం. అధిష్ఠానం దృష్టిని ఆకర్షించేందుకు వారు ఢిల్లీ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిగాయి. మీనాక్షి నటరాజన్ ఈ విషయాన్ని స్వయంగా మాట్లాడుకోవాలని సూచించిందని వర్గాలు వెల్లడించాయి. రేపు మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఆమెను కలవనున్నారని తెలుస్తోంది. కేబినెట్‌లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే పార్టీ వర్గీయంగా ప్రభావం చూపే అవకాశముందని, ఇందుకు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments