
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక బాధాకర ఘటన చోటు చేసుకుంది. పోషించే స్థాయి లేక తల్లిదండ్రులు తమ బిడ్డను వేరే వారికి మూడు లక్షలకు అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంలోనే తల్లిదండ్రులకు చెందినటువంటి ఇద్దరు కూతుర్లు చెల్లిని అమ్మొద్దు అంటూ బ్రతిమిలాడుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరకి పోలీసుల వరకు వెళ్ళింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే … రాష్ట్రంలోని నల్గొండ జిల్లా, ఎల్లాపురం తండాకు చెందినటువంటి బాబు, పార్వతి దంపతులకు మూడవ సంతానంగా మరో కుమార్తె జన్మించింది. అప్పటికి ముందే ఇద్దరు కుమార్తెలు ఉండగా తాజాగా మరొక కుమార్తె జన్మించింది. దీంతో ఇప్పటికే ఇద్దరు కూతుర్లను పోషించలేకపోతున్న తల్లిదండ్రులకు మరోసారి కూతురే పుట్టడంతో పోషించే స్థోమత లేక గుంటూరుకు చెందినటువంటి ఒక జంటకు మూడు లక్షల రూపాయలకు విక్రయించే పనిలో పడ్డారు. ఈ సందర్భంలో ఇద్దరు పెద్ద బిడ్డలు చెల్లిని అమ్మొద్దు అంటూ బ్రతిమలాడుతూ చాలా బాధగా ఏడ్చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో మెల్లిగా పోలీసులు వరకు వెళ్లడంతో వారు దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కన్న బిడ్డను వేరే ఒకరికి అమ్మడం అనేది ఎంత నేరమైన కూడా పోషించే స్తోమత లేకపోవడంతోనే ఆ తల్లిదండ్రులు అలా చేస్తున్నట్లుగా స్థానికులు చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా బాధకు లోనయ్యారు. అధికారులు లేదా ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందజేయాలని.. కన్న తల్లిదండ్రుల దగ్గరే ఆ బిడ్డను ఉంచాలి అని మరి కొంతమంది సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు.
Read also : గాయం కారణంగా ప్రతీకా అవుట్.. ఆమె ప్లేస్ లోకి కీలక ప్లేయర్?
Read also : విజయ్ తో నిశ్చితార్థం నిజమేనా?.. రష్మీక సమాధానం ఇదే!





