క్రైమ్తెలంగాణ

రావిర్యాలలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న డష్టని రియల్ ఎస్టేట్ సంస్థ!

-రావిర్యాలలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న డష్టని రియల్ ఎస్టేట్ సంస్థ
-భూమిని అమ్ముతావా.. లేదా చస్తావా…? అంటూ బెదిరింపులు
-రాత్రికి రాత్రి పశువుల పాకను జెసిపి లతో మాయం చేసిన గ్యాంగ్
-డయల్ 100 తో ఘటన స్థలానికి చేరుకున్న ఆదిభట్ల పోలీసులు
-భయ బ్రాంతులకు గురవుతున్న రైతులు శేషగిరి రావు, వెంకటేశ్వర్ రావు

మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:-
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో దారుణాలకు పాల్పడుతున్న డస్టిని రియల్ ఎస్టేట్ సంస్థ. రావిర్యాల కొంగర కుర్ధు 325 సర్వే నంబర్ లో రంగరాజు శేషగిరి రావు,రంగరాజు వెంకటేశ్వర రావు తాత ముత్తాతల నుండి వారి ఉన్న 3 ఎకరాల వ్యయ సాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కాగా… ఇటీవలే డష్టని రియల్ ఎస్టేట్ సంస్థ చుట్టూ ఉన్న భూములను కొనుగోలు చేసింది.పక్కనే ఉన్న 3 ఎకరాల భూమిని కూడ తనకే అమ్మాలంటూ 4 సంవత్సరాలుగా రైతుల వెంట పడుతూ తనకు అమ్మక పోతే చంపుతామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో కూడా 2001- 2022 సంవత్సరంలో కూడా ఇలాగే బెదిరిస్తే వారిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు.శనివారం సాయంత్రం ఆవులకు, ఎడ్లకు మేతవేసి వెళ్ళి తిరిగి ఉదయం వచ్చి చూసే సరికి అక్కడ పశువుల పాక,కనిపించకపోయే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యామన్నారూ. ఇదంతా డస్టిని రియల్ ఎస్టేట్ సంస్థ కు సంబంధించిన వ్యక్తులే చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఉదయం డయల్ 100 కు చేయగా వెంటనే ఆదిభట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచార చేసి అక్కడ ఉండే మూడు ఆవులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించడం లేదని వారికి వివరించారు.గతం లో కూడా పవన్ అనే వ్యక్తి చంపుతామని బెదిరించారని తెలిపారు. డస్టని రియల్ ఎస్టేట్ సంస్థ యజమాన్యంతో మాకు ప్రాణభయం ఉందని వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా పోలీసులకు తెలిపారు.

విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి : కల్వకుర్తి సిఐ

గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button