తెలంగాణ

అంతర్జాతీయ అవార్డు గ్రహీత కు అరుదైన గౌరవం

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి:- అమెరికాకు చెందిన వైద్య ఆరోగ్య మాస పత్రిక పల్మనరీ మెడిసిన్ తనను ఓ సదస్సు లో పాల్గొనేందుకు ఆహ్వానించిందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్, పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ తెలిపారు. ఆయన ఈమేరకు ఓ ప్రకటన విడుదల అమెరికాకు చెందిన పల్మనరీ మెడిసిన్ వారు ఫోన్ చేసినట్టు రఘునందన్ వివరించారు. పౌర సరఫరాల శాఖ నల్లగొండ జిల్లా కు ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ గా మాచన రఘునందన్ పని చేస్తున్నారు. ఆయన 22ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు విశేష కృషి చేస్తున్నా రు. వరల్డ్ టి బీ డే సందర్భంగా కూడా కొత్త ఢిల్లీ కి చెందిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వారు సైతం ..రఘునందన్ ను పొగాకు నియంత్రణ సదస్సు కు ఆహ్వానించారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు పొగాకు ,ధూమపానం అలవాటు, తన ఇద్దరు ఆప్త మిత్రుల ను బలి తీసుకుందని రఘునందన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఓ మిత్రుడికిచ్చిన వాగ్దానం వల్ల రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కు అలుపెరుగని కృషి చేస్తున్నట్టు రఘునందన్ వివరించారు. 2020 లో జర్మనీ,2022 లో దక్షిణ ఆఫ్రికా,2023,24 లో ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందాయని రఘునందన్ తెలిపారు.తాజాగా పల్మనరీ మెడిసిన్ మాస పత్రిక వారి వైద్య విజ్ఞాన సదస్సు లో పాల్గొనేందుకు ఏప్రిల్ నెల లో అమెరికా రావాలని కబురు అందిందని మాచన తెలిపారు.

సీఎం నినాదాల గోల – కేసీఆర్‌కు మొదలైన కొత్త తలనొప్పి..!

అమీన్‌పూర్‌లో దారుణం- పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button