
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే హరీష్ రావు తండ్రి మృతి పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే రాష్ట్ర రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు హరీష్ రావు తండ్రికి సంతాపం తెలియజేశారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా హరీష్ రావు ఇంటివద్దె ఉండి అన్ని బాగోగులు చూసుకుంటున్నారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ స్వయంగా కేసిఆర్ కు బావ అవుతారు. దీని కారణంగానే కెసిఆర్ కుటుంబం మొత్తం కూడా హరీష్ రావు తండ్రి మరణ వార్త తెలుసుకున్నప్పటి నుంచి అక్కడే వచ్చి ఉన్నారు. తన మామ అంతక్రియలకు మాత్రం కవిత దూరంగా ఉన్నారు.
అయితే కవిత రాకపోవడంపై చాలామంది చాలా రకాలుగా చర్చిస్తూ ఉన్నారు. కవిత రాకపోవడానికి ముఖ్య కారణం ఇటీవల హరీష్ రావు పై ఆమె చేసినటువంటి సంచలన ఆరోపణలు. హరీష్ రావు పై ఆరోపణలు చేయడం వలనే నేడు ఆమె హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అంత్యక్రియలకు రాకుండా దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంలోనే కవిత కూడా హరీష్ రావు ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేసి ఉంటే చాలా బాగుండేది అని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.
Read also : మునుగోడులో డిపిఓ ఆకస్మిక పర్యటన
Read also : 10 లక్షల అప్పు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. సరదాగా AI ని ప్రశ్నించాడు.. చివరికి?





