తెలంగాణరంగారెడ్డిహైదరాబాద్

రాజా సింగ్ హత్యకు పక్కా స్కెచ్? నిందితుల ఇళ్లలో తుపాకులు, కత్తులు!

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నివాసం దగ్గర రెక్కీ కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఇద్దరు యువకుల విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి రెక్కీ కేసులో రంగంలోకి కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు దిగారు. రాడికల్ లింక్స్ కోసం సిఐ సెల్ టీమ్స్ ను రంగంలోకి దింపారు హైదరాబాద్ సిపి సీవీ ఆనంద్.

ఉగ్ర లింకులు, స్లిప్పర్ సెల్స్ కోణంలో విచారిస్తోంది సిఐ సెల్. ఇక నిందితుడు ఖాజాకు సంబంధించిన బోరబండ నివాసంలో 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో వీడియోస్ పంపిన వ్యక్తి వివరాలు సేకరిస్తోంది సిఐ సెల్. ఇద్దరి నిందితుల మొబైల్స్ డేటా రికవరీ చేశారు పోలీసులు. ముంబై లింకులను లాగుతున్నారు.

మరోవైపు రాజా సింగ్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల కార్యకర్తలు రోడ్డెక్కడంతో హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్ నెలకొంది. పురాణపుల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు బిజెపి కార్యకర్తలు. ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజా సింగ్ ఇంటి దగ్గర నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించినా తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఆందోళనలతో గోషా మహాల్ నియోజకవర్గంతో పాటు పాతబస్తీలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

Read More : రోడ్డెక్కిన ఎమ్మెల్యే రాజా సింగ్.. పాతబస్తీలో హై టెన్షన్

మంగళ్ హాట్ లోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది. అందులో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను ఇస్మాయిల్, ఖాజాగా గుర్తించారు. నిందితుల ఫోన్లలో రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. వాళ్ల దగ్గర గన్స్, బుల్లెట్లు కూడా దొరికాయి. దీంతో రాజా సింగ్ ను హత్య చేసేందుకే ఆ యువకులు వచ్చారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తన ఫోటోలు తీసి ముంబైకి పంపించారని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు.

Back to top button