హైదరాబాద్ లో కొత్తగా నయీం గ్యాంగ్ తరహా గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. పేదల ఇండ్లను కబ్జా చేస్తూ అడ్డుకుంటే దాడులు చేస్తోంది గ్యాంగ్. ఈ గ్యాంగ్ బహిరంగంగా రెచ్చిపోతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో సర్వే నంబర్ 63/1 లోని ప్రభుత్వ భూమిలో, 1999లో 1150 మంది పేదలకు అప్పటి హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు.ఆ ప్రాంతమే దేవేందర్ నగర్, గౌతం నగర్, సీతారాం నగర్, అంబేద్కర్ నగర్‌లు ఏర్పడ్డాయి.ఈ కాలనీలో ఇండ్లు కట్టుకొని పేదల స్థలాలే టార్గెట్‌గా ఒక గ్యాంగ్ కబ్జాలు చేస్తుంది.రాత్రికి రాత్రే భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
అడ్డుకున్న పేదలపై ఆ గ్యాంగ్ దాడి చేస్తుందని, వీరి నుండి తమ భూమిని కాపడలంటూ రెవెన్యూ, పోలీసు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.