-
రూ.155.45 కోట్ల నిధులతో నిర్మాణాలు
-
ఇక రైతుల కష్టాలు తీరనున్నాయి
-
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ఖమ్మం, క్రైం మిర్రర్ః ఖమ్మం జిల్లాలో అధునాత హంగులతో కొత్త మోడల్ మార్కెట్ ఈ నెలాకరు లోగా అందుబాటులో రానుంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతోరైతుల కష్టాలు ఇక తీరనున్నాయి.
మొత్తం 7 షెడ్లు నిర్మిస్తుండగా ఐదు షెడ్లు పూర్తికాగా, నెలాకరునాటికి మిగిలిన రెండు షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు.
శరవేగంగా పనులు…
రూ.155.45 కోట్లతో 15 ఎకరాల స్థలంలో ఆధునిక వసతులతో రైతులకుఅందుబాటులోకి రానుంది. దీనిని పాతమార్కెట్ షెడ్లను కూల్చి వేసి దీనిని నిర్మిస్తున్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం కావడంతోరాష్ట్రంలోనే మోడల్ మార్కెట్ గా దీన్ని తీర్చిదిద్దాలని రూపకల్పన చేసి గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ మార్కెట్ ను సంక్రాంతికి రైతులకు అందుబాటులోకి తీసుకరావాలని చూడగా అది సాధ్యపడలేదు. దీంతో ఈనెలాకరు లోగా పూర్తి చేసి అందుబాటులో తేవాలని మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
పెరిగిన బస్తాల సామార్థ్యం నిల్వ..
ఖమ్మం మార్కెట్‌కు తెలంగాణలోనే ఘనమైన పేరుంది. మిర్చి పంట అంటేనే మొదటగా గుర్తుకు వచ్చేది ఖమ్మం జిల్లానే. ఒక్కప్పుడు 80వేల బస్తాల సామర్థ్యం ఉండగా ఇప్పుడు నిర్మాణమయ్యేది రెండు లక్షల బస్తాల వరకు విస్తరిస్తూ నిర్మాణాలు చేస్తున్నారు.
ఈ మార్కెట్లో రైతులు విశ్రాంతి తీసుకోవడానికి ఆధునిక గదులు, మూడు టాయిలెట్ బ్లాక్స్, నాలుగు ఆర్వో వాటర్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తున్నారు.
అంతే కాకుండా రైతులు టిఫిన్స్, భోజనం చేసేందుకు క్యాంటీన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.





