
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదవ టెస్టులో భారత్ 6 పరుగులు తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం గౌతమ్ గంభీర్ సెలబ్రేషన్స్ అంతా.. ఇంతా.. కాదు. మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలవగా భారత్ కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఇక మిగతా టెస్ట్ డ్రా కావడంతో ఇంగ్లాండ్ దే పై చేయిగా నిలిచింది. ఇక ఉత్కంఠభరితంగా జరిగిన 5 వ టెస్టులో భారత్ విజయం సాధించి టెస్ట్ సిరీస్ ను డ్రాగ ముగించింది. అయితే 5 వ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఒక దశలో గెలుపు ఇంగ్లాండు దే అని అంతా అనుకున్నారు . కానీ భారత్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ మరియు ప్రసిద్ధి కృష్ణ ఇద్దరు కూడా అద్భుతమైన బౌలింగ్ వేయడంతో అది పూర్తిగా తారుమారు అయింది. ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది.
Read also : పోలీస్ స్టేషన్‌లోనే అక్రమ దందా – ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్వాకం
చివరి రోజు ఇంగ్లాండ్ గెలవాలంటే 35 రన్స్ చేయాలి. ఒకవేళ భారత్ గెలవాలంటే నాలుగు వికెట్లు తీయాలి. చివరిలో సిరాజ్ మరియు ప్రసిద్ కృష్ణ బౌలింగ్ తో టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. కేవలం 6 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. సిరాజ్ లాస్ట్ వికెట్ తీయగానే కోచ్ గంభీర్ సెలబ్రేషన్స్ మామూలుగా చేయలేదు. తోటి సిబ్బందితో సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. తన కెప్టెన్ తో గిల్ అద్భుతమైన ఆటతీరుతో అందరి అభిమానుల హృదయాలను గెల్చుకున్నావని గిల్ ను హగ్ చేసుకున్నారు గంభీర్. టీమిండియా 5వ టెస్టులో గెలిచి సిరీస్ ను డ్రా గా ముగించడంతో భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ ఫోటోలను పంచుకుంటున్నారు.
Read also : మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనులు వేగవంతం చేయండి