
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- ఆయనొక రాజకీయ నాయకుడు… ప్రజా క్షేత్రంలో పదవిని పొంది ప్రజలకు అయిదు సంవత్సరాలు సేవలు అందించిన వ్యక్తి. అంతే కాదండోయ్ డబ్బున్న రాజకీయానికి ఆయన విరోధనే చెప్పుకోవాలి. తనకున్న స్తొమతతోనే ప్రజలకు ఏదో ఒక్కటి చెయ్యాలని దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. తాను ఉన్న రాజకీయ పార్టీలో తనకంటూ ఒక పేరును సంపాదించుకొని, అసలుసిసలైన నాయకత్వంతో ప్రజల కోసం, నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని ముందేసుకొని నడిపిస్తుంటాడు. దళిత సామాజిక వర్గంలో పుట్టినప్పటికి, పై స్థాయిలో ఆలోచిస్తూ, ఉన్నత నిర్ణయాలతో ముందుకు సాగే ఆ నేత గురించి ఒకసారి చర్చించుకుందాము. మండలంలోని నామాపురం ఎంపిటిసిగా ప్రజలకు సేవలు అందించిన, ఊరిపక్క సరితానగేష్ అంటే, గ్రామంలోనే కాదు మండలంలో కూడా ఒక బ్రాండ్ అనే చెప్పుకోవాలి.
ఒక పక్క రాజకీయం చేస్తూనే, మరో పక్క ప్రజలకు ఏదో ఒక రకమైన సేవలు అందిస్తూ తనకంటూ ఓ ముద్రను వేసుకున్నాడు ఈ నేత. అయిదు సంవత్సరాలు ప్రభుత్వం నుండి వచ్చిన ఫండ్ తో, అభివృద్ధి పనులు చేసి అందరి మన్ననలు పొందిన ఆయన, తన ఖాతాలో మరో మానవత్వపు గుర్తును ముద్రించుకున్నారు. మేటిచందాపురం గ్రామానికి చెందిన మండారి యాదయ్య గత కొన్ని సంవత్సరాలుగా, హెర్నియా హైడ్రోసెల్ తో బాధపడుతూ, మంచానికే పరిమితమయ్యడు. ఆపరేషన్ చేసుకుందామంటే ఆర్థిక పరిస్థితి బాలేక ఆగిపోయిన మండారి యాదయ్య కుటుంబానికి , ఊరిపక్క సరితానగేష్ ఆధారమయ్యడు. సహచరుల ద్వారా సమాచారం తెలుసుకొని, 50వేల రూపాయల ఆర్థిక సహకారంతో, ఉచితంగా వైద్యాన్ని అందించి ప్రజల మనసును దోచుకున్నారు. పుణ్యానికి వస్తే, పాపం చేసైనా సొమ్మును దోచుకోవాలని చూసే ఈ కాలంలో, మానవత్వాన్ని చాటి నాగేష్ చేసిన సేవకు మండల ప్రజలు అభినందించారు. మండారి యాదయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపి వారి కుటుంబానికి దైవంగా మారారు. నాగేష్ మనసు వెన్న వంటిది, ఆపద అంటే కరిగిపోయి కండ్లల్లో పెట్టుకుంటాడని ప్రజల అభిప్రాయం. నగేష్ అందించిన సేవకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలు నాయకుడివంటే నువ్వే అన్న అంటూ సోషల్ మీడియా వేదికగా పొగడ్తలతో ముంచెత్తారు.
కేరళ మాజీ సీఎం, సీపీఎం సీనియర్ నాయకుడు అచ్యుతానందన్ కన్నుమూత
ఒడిశాలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడి ఘాతుకం… ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం