Homeఅంతర్జాతీయం50 సంవత్సరాల తర్వాత చంద్రుడి వైపు మానవ యాత్ర

50 సంవత్సరాల తర్వాత చంద్రుడి వైపు మానవ యాత్ర

అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు NASA సిద్ధమైంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి పరిధిలోకి పంపించే లక్ష్యంతో ‘ఆర్టెమిస్ II’ మిషన్‌ను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. Artemis II పేరిట జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న కెనెడీ స్పేస్ సెంటర్‌లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. ప్రయోగానికి ముందు ట్యాంకింగ్ ఆపరేషన్స్‌లో భాగంగా రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియను అదే రోజు సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న ప్రయోగం సాధ్యం కాకపోతే, ఏప్రిల్ 6 వరకు లేదా చివరి అవకాశంగా ఏప్రిల్ 30న ప్రయోగం నిర్వహించే అవకాశం ఉంది.

ఈ మిషన్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, విక్టర్ గ్లోవర్ పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా పాల్గొంటున్నారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్ క్రాఫ్ట్ మొదట లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశించి, దాదాపు 24 గంటల తర్వాత ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్‌లో అత్యంత కీలక ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ ఫ్లైబై చేయడం. ఈ సమయంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోపే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 రికార్డును అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏప్రిల్ 7న ఈ మిషన్‌లోని వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర సిబ్బందితో ఆడియో సంభాషణ నిర్వహించనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడే కార్యక్రమం ఉండగా, ఏప్రిల్ 10న ఈ మిషన్ ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్ క్రాఫ్ట్‌ను సురక్షితంగా భూమికి తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.

ALSO READ: వేడెక్కిన తమిళనాడు ఎన్నికల పోరు.. నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments