
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్ చెప్పింది. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 53 శాతానికి పెరిగిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం ఎప్పుడు వేస్తారా.. అని కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. కొత్త వేతన సంఘం అమలుకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినప్పుడల్లా ప్రభుత్వం అలాంటి ప్రతిపాదనలేమీ లేవని చెబుతూ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
రూల్స్ అతిక్రమించిన జనసేన నేత!… పార్టీ నుండి తోలిగింపు?
గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో ప్రధానంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కమిషన్ చైర్మన్‌ను త్వరలోనే నియమిస్తామన్నారు. ఈ కమిషన్ వచ్చే ఏడాది అంటే 2026 నాటికి తన నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.
టీమ్ ఇండియా ప్లేయర్లకు కఠిన ఆంక్షలు విధించిన బీసీసీఐ !..
పే కమీషన్ చరిత్రను పరిశీలిస్తే.. 7వ వేతన సంఘం కంటే ముందు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 4వ, 5వ, 6వ వేతన కమీషన్‌ల కాలవ్యవధి సమానంగా 10 సంవత్సరాలు ఉండేది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం 2016లో అమల్లోకి వచ్చింది. 2025 డిసెంబర్‌తో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఈ గడువు కంటే ముందే ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.