
పదవ తరగతి పరీక్ష పత్రం లీక్ చేశారంటూ తమపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేశారని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ గౌడ్, నకిరేకంటి నరేందర్, ఉగ్గిడి శీను కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు.. కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నే క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్ లపై మూడు వేరువేరు కేసులు నమోదు..
మర్రూరు మాజీ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదులో A1 కేటీఆర్,A2 కొనతం దిలీప్ కుమార్, A3 టీ న్యూస్ యజమాన్యం నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో A1 మన్నెం క్రిశాంక్, A2 కేటీఆర్, A3 కొనతం దిలీప్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదులో A1 కొణతం దిలీప్ కుమార్, A2 మన్నెం క్రిశాంక్, A3 కేటీఆర్ A4 తెలుగు స్క్రిబ్ ఎండి, A5 మిర్రర్ టీవీ యాజమాన్యం సోషల్ మీడియా ఎక్స్ లో వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ షేర్ చేశారని బాధితుల వెల్లడి..
పొలిటికల్ వార్ కు తెర లేపిన టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. పేపర్ లీకేజీ కేసులో 11 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు ఆరుగురు వ్యక్తులను రిమాండ్ పంపించిన పోలీసులు..