కృష్ణా, క్రైమ్ మిర్రర్ః మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఘటన నేపథ్యంలో గురువారం పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని అనుచివ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా చిలకలపూడి సీఐ పరమేశ్వర రావును బాడి షేమింగ్ చేస్తూ అవమానించారు. అంతేగాకుండా పోలీసులను బెదిరించారు. మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీసు అధికారులు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసు స్టేషన్లో పేర్కి నానిపై పోలీసులు కేసు మోదు చేశారు.
నిన్న మచిలీపట్నం కొబ్బరితోటలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన పేర్ని నాని పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవ్వరినీ వదలమని, తమ ప్రభుత్వం వచ్చాక అంతు చూస్తామంటూ పోలీసులను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
