
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి మేడారం మహా జాతరకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ జాతరకు కొద్ది రోజుల ముందు నుంచే మేడారంలో భక్తుల హవా కొనసాగుతుంది. ఈనెల చివర ఆఖరిలో ఈ మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచి వేల సంఖ్యలో భక్తులు మేడారం సమ్మక్క- సారక్కను దర్శించుకుంటున్నారు. కాగా ఈ మేడారంలో ఒక వినూతనమైనటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచినటువంటి ఈ మేడారం మహా జాతరలో వినూత్న ఉపాధి మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మహా కుంభమేళాలో పల్లపుల్లల విక్రియాల తరహాలోనే ఇక్కడ కూడా చలి తీవ్రతను ఆసరాగా తీసుకొని చాలామంది వేడి నీటిని విక్రయిస్తూ ఉన్నారు. మేడారం మహా జాతరకు వచ్చేటువంటి భక్తులు తల స్నానాలు చేసి అమ్మవారులను దర్శించుకుంటూ ఉంటారు. ఏ సందర్భంలో చలి ఎక్కువగా ఉన్న కారణంగా కట్టెల పొయ్యిలపై వేడి నీటిని కాచి బకెట్ కు 50 రూపాయలు చొప్పున కొంతమంది అమ్ముతూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బకెట్ యాభై రూపాయలు చొప్పున అమ్ముతూ ప్రతిరోజు కూడా కొన్ని వందల రూపాయలను సంపాదిస్తూ ఉన్నారు. మహా జాతరకు వచ్చేటువంటి భక్తుల అవసరాన్ని తీరుస్తూనే స్థానికులు ఈ సీజన్లో వ్యాపారంతో ఉపాధి పొందుతూ ఉండడం విశేషంగా అనిపిస్తుంది. కొంతమంది ఇలా చేయడాన్ని సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు.
Read also : వాళ్ల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయను : సీఎం రేవంత్
Read also : Smartphone, TV Prices Hike: పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, టీవీల ధరలు, కారణం ఏంటంటే?





