జాతీయం

మద్యం తాగుతున్నారా!… క్యాన్సర్ ముప్పు ఎదుర్కోవాల్సిందే?

దేశవ్యాప్తంగా ప్రస్తుత రోజుల్లో ఆల్కహాల్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఇటువంటి పరిస్థితులలో మద్యం వినియోగిస్తున్న వ్యక్తులకు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా ఎక్కువగా మద్యం సేవించే వ్యక్తులకు క్యాన్సర్ ముప్పు కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆల్కహాల్ వినియోగం అనేది ఎక్కువైతే కచ్చితంగా అది ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

దర్శకులకు క్షమాపణలు!… త్వరలోనే షెడ్యూల్లో పాల్గొంటా?

మద్యం అనేది ఎక్కువ తాగడం వల్ల పెద్ద పేగు మరియు మల క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉందని తెలియజేశారు. రోజుకు కనీసం 20 గ్రాముల ఆల్కహాల్ తీసుకున్నా గాని దాదాపుగా 15% క్యాన్సర్ రిస్క్ ఉంటుందని వైద్యులు వెల్లడించిన అధ్యయనంలో వెళ్లడైంది. ఆల్కహాల్ వల్లే కాకుండా ప్రతిరోజు 30 గ్రాముల వరకు ఎర్ర మాంసం తినడం వల్ల కూడా పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం దాదాపుగా 8% ఎక్కువ ఉందని తేలింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు తెలియజేశారు.

రిటైర్మెంట్ ప్రకటించనున్న స్టార్ క్రికెటర్!… మరి ఛాంపియన్స్ ట్రోఫీ?

ఇక ఈ మధ్యం వల్ల వచ్చినటువంటి క్యాన్సర్ ముప్పుకు కొన్ని ఆహార మార్పులతో తగ్గించుకోవచ్చు అని తెలియజేశారు. మనం తీసుకునేటువంటి ఆహారంలో పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్లను అధిక మొత్తంలో తగ్గించుకోవచ్చని డాక్టర్లు తెలియజేశారు. ఏది ఏమైనా సరే ఈమధ్య ఒక పూట అన్నం మానుకో మన్న మానుకుంటారు కానీ మద్యం సేవించకుండా మాత్రమే అయితే ఉండట్లేదు. చిన్న ఫంక్షన్స్ జరిగినా కానీ అభిరుచులు కలిగిన ఆహారాన్ని పక్కన పెట్టేసి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ఆల్కహాల్ కి ఎక్కువగా విలువనిస్తున్నారు. కాని ప్రస్తుత రోజుల్లో ఆల్కహాల్ వల్ల అనారోగ్యానికి గురవుతామన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

ఈ ఏడాది పరీక్షలు జరుగుతాయి!… ఇంటర్ విద్యార్థులకు షాక్?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button