
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 20 ఏళ్ల వయసు ఉన్న యువత పై చదువుల కోసం పట్టణాలకు అలాగే విదేశాలకు వెళ్ళిపోతూ పుట్టి పెరిగిన గ్రామాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. బహుశా అందుకేనేమో ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోనూ యువత ఎక్కువగా ప్రోత్సాహం చూపించడం లేదు. కేవలం రాజకీయ నాయకుల కొడుకులు అలాగే కూతుర్లు మాత్రమే మరో జనరేషన్ రాజకీయాన్ని ఏలుతుంది. అయితే తాజాగా ఒక సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఒక 22 ఏళ్ల యువతీ సర్పంచ్ అయ్యి తమ ఊరిని బాగు చేయాలన్నకలతో ముందడుగు వేసింది. ఉత్తరాఖండ్ కు చెందిన కుయుగ్రామ్ ఎన్నికల్లో ఆమె సర్పంచ్ గా గెలిచి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈరోజుల్లో డిగ్రీ అలాగే బీటెక్ వంటివి పూర్తయిన తర్వాత పట్టణాలకు వలస వెళ్లి పోతున్న యువతను చూస్తున్నాం. కానీ ఈ ఉత్తరాఖండ్ కు చెందిన 22 ఏళ్ల సాక్షి రావత్ అనే యువతి మాత్రం తన గ్రామాన్ని ఎలాగైనా సరే బాగు చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి సర్పంచ్ గా గెలిచారు. యువ శక్తితో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె గ్రామస్తులు అందరికీ కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. ప్రస్తుత కాలంలో అభివృద్ధి పనులు చేయాలంటే దానికి ముఖ్యంగా యువత ముందడుగు వేయాలి. ఆ ఉద్దేశంతోనే సాక్షి రావద్దని 22 ఏళ్ల ఉత్తరాఖండ్ చెందిన అమ్మాయి సర్పంచ్ గా గెలిచి తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది.
Read also : Crime Mirror Updates 28-11-25: తెలంగాణలోని ఈనాడు ముఖ్యమైన వార్త
Read also : Cold Weather: రాష్ట్రంలో చలి పంజా.. రేపు, ఎల్లుండి జర జాగ్రత్త!





