Homeఆంధ్ర ప్రదేశ్నెల్లూరులో జెన్ జి యువత పోటీ...!

నెల్లూరులో జెన్ జి యువత పోటీ…!

  • కూటమి తరుపున నలుగురికి అవకాశాలు

  • ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఇటీవల రాజకీయాల్లో వినిపిస్తున్న మాట జెన్ జి. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి అనేది ఈ ఉద్యమ లక్ష్యం. అయితే ఈ మాటను ఎప్పటినుంచో నేతలు చెబుతూ వచ్చారు. కానీ అమలు చేస్తున్నది కొంతమందే. స్థానిక ఎన్నికలవేళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం ఓ నలుగురు జెన్ జి యువతకు కార్పొరేట్ టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించడం సంచలనంగా మారింది. నియోజకవర్గ పరిధిలో దాదాపు 55 రోజులపాటు సుమారు 20వేల మంది యువతి యువకులతో ముఖాముఖి, మాటామంతి నిర్వహించారు. వారి ఆకాంక్షలను తెలుసుకున్నారు. ఎంపిక చేసిన నాలుగు కార్పొరేట్ స్థానాలను రాజకీయ నేపథ్యం లేని విద్యావంతులైన యువ అభ్యర్థులకే ఖరారు చేశారు.

ఏ నేపథ్యం లేకుండానే…

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఏ నేపథ్యం లేని నలుగురు యువకులకు కూటమి తరుపున టిక్కెట్లు దక్కాయి. బీటెక్, ఎంబీఏ, ఎల్ఎల్బి వంటి ఉన్నత విద్యను అభ్యసించి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న యువ నాయకులకు స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసి బరిలో నిలిపారు. ఎటువంటి రాజకీయ కుటుంబాల అండదండలు లేకపోయినా.. ప్రజా సమస్యలపై అవగాహన, డివిజన్ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న యువతను గుర్తించి పార్టీ బీఫారాలు అందజేయడం.. స్థానికంగా యువతలో సరికొత్త ఉత్సాహం నింపింది.

విద్యాధికులే…

నెల్లూరు కార్పొరేషన్ కు సంబంధించి 16వ డివిజన్ నుంచి షేక్ సాహిద్ బరిలో నిలిచారు. స్థానిక సమస్యలపై గళం ఎత్తే యువకుడికి టిక్కెట్ ఇచ్చారు. 18వ డివిజన్ నుంచి కొమ్మిరెడ్డి ప్రవల్లిక, 21వ డివిజన్ నుంచి పొట్లూరి అఖిల్, 26వ డివిజన్ నుంచి వేముల కార్తీక్ లకు టికెట్లు ఇచ్చారు. ఈ నలుగురు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న యువకులే. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వీరు ఎన్నికల బాధ్యతను, ప్రచార ఖర్చును తన భుజాన వేసుకుని ప్రచారంలో ముందుండి నడిపిస్తున్నారు.

ఒత్తిళ్ళను అధిగమించి…

ఈ నలుగురు యువకులకు అవకాశం కల్పించడంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు కోటంరెడ్డి. పార్టీలో సీనియర్ నేతలు, పలువురు ఆశావహుల నుంచి తీవ్ర వత్తిళ్లు, అంతర్గత అసంతృక్కులు ఎదురయ్యాయి. కానీ కోటంరెడ్డి మాత్రం వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. యువత కేవలం ఎన్నికల ప్రచారాల్లో జండాలు మోయడానికి పరిమితం కాకూడదు.. చట్టసభలతో పాటు స్థానిక సంస్థల నిర్ణయాధికారాల్లోనూ భాగస్వాములు కావాలి అనే సిద్ధాంతానికి కట్టుబడి తన నిర్ణయాన్ని అమలు చేసి చూపించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం!
  2.  జోగి రమేష్ కోడలి కారు ప్రమాదం…!
  3.  దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యువ నాయకుడు పెరుమాండ్ల సురేష్..!
  4.  హైద‌రాబాద్‌లో విషాదం…! నీళ్ల బ‌కెట్‌లో ప‌డి చిన్నారి మృతి…

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు