క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ పై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాలు తలెత్తిన కడప, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లతోపాటు మైదకూరు, రాజంపేట మున్సిపాలిటీలో నామినేషన్ల తాకలకు తిరిగి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో అర్హులైన అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు వేసేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది.
కడప కార్పొరేషన్ లో…
కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 వార్డుల్లో నామినేషన్ల దాఖలుకు మరోసారి అవకాశం కల్పించారు. కార్పొరేషన్ పరిధిలోని 6, 11,13, 15,16,17,24,31, 34, 52, 55 డివిజన్లలో ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రాజంపేట మున్సిపాలిటీలోని 11 వార్డులలో నామినేషన్ల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మైదాకూరుకు సంబంధించి మొత్తం 32 వార్డుల్లోనూ నామినేషన్ల గడువును పొడిగిస్తూ నూతన అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18 వార్డులలో నామినేషన్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించనున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ నెల 25న ఎన్నికల బరిలో నిలిచే మున్సిపల్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.
అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో…
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అధికార కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని.. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మొత్తం 19 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గురించి ఈ పిటిషన్ లో ప్రస్తావించారు. కనిగిరి దర్శి, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల వంటి సమస్యత్మక ప్రాంతాల్లో అభ్యర్థులను భౌతికంగా అడ్డుకున్నారని ఫిర్యాదు చేసింది. వీటిపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ అందిన దరఖాస్తులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. కానీ అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు అందుకున్న ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే మారిన షెడ్యూల్ తో పోలింగ్ తేదీ కూడా మారింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 1న పోలింగ్ జరగనుంది.
ఇవి కూడ చదవండి:
- ప్రభాస్ బర్త్‌డేకు గ్లోబల్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్ నుంచి జపాన్ వరకు అభిమానుల సందడి!
-
పులివెందులలో ఉద్రిక్తత.. వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటికి పోలీసుల నోటీసులు!
-
మహారాష్ట్రలో పట్టపగలే దారుణ హత్య.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి, ఇనుప రాడ్‌తో దాడి!
-
మథురలో దారుణం.. భర్త, పిల్లలను వదిలి లివ్-ఇన్‌లో ఉంటున్న మహిళ హత్య!
