Homeక్రైమ్మచిలీపట్నంలో దారుణ హత్య.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం

మచిలీపట్నంలో దారుణ హత్య.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం

క్రైమ్ మిర్రర్ : కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. బందరు మండలం వాడపాలెం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా ముక్కలుగా నరికినట్లు సమాచారం. మృతదేహంలోని మొండాన్ని ఒకచోట, కాళ్లు, చేతులను మరోచోట పడేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

మృతుడు ఎవరు? హత్యకు కారణమేంటి?

వాడపాలెం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. అతడిని ఎవరు హత్య చేశారు? వ్యక్తిగత కక్షలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు

సమాచారం అందుకున్న బందరు రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్.పేట సీఐ ఏసుబాబు స్వయంగా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి గుర్తింపును నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు

ఈ ఘటనను జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి గుర్తింపు, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలు వెల్లడైతే కేసులో కీలక పురోగతి సాధించే అవకాశం ఉంది. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
also read : దుర్గాపూజ ముగించుకుని తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు