హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తాజాగా తెలంగాణ హైకోర్టు సమీపంలో మదీనా వద్ద ఉన్న బాంబే హౌజరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున హైకోర్టుకు ఎదురుగా ఉన్న క్రాస్ రోడ్డు వద్ద గల బాంబే హౌజురీ వస్ర్త దుకాణం, గోదాములో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ప్రజలు భయంతో పరుగులు తీసారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా ఆకస్మిక అగ్ని ప్రమాదంతో మంటలు, పొగ ఆ ప్రాంతంలో దట్టంగా అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇవి కూడ చదవండి:
- రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి?: ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు
-
తెలంగాణలో యాసంగి సాగు ఆశాజనకం: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పుంజుకోనున్న పంటల విస్తీర్ణం!
-
వర్షపాతంతో వణికిపోతున్న చెన్నై
-
బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
