Homeలైఫ్ స్టైల్రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి?: ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు

రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి?: ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు

మన శరీరంలో ప్రతి అవయవానికి మరియు కణానికి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్‌ను మోసుకెళ్లడంలో హిమోగ్లోబిన్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలు మరియు హిమోగ్లోబిన్ శాతం సరైన ప్రమాణంలో ఉన్నప్పుడే శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఒకవేళ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే, తీవ్రమైన నీరసం, అలసట కలగడమే కాకుండా కాలేయం , కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తీవ్రమైన రక్తాభావం వల్ల తలసీమియా వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిమోగ్లోబిన్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచుకోవడానికి మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం…

ఆహారపు అలవాట్లు:- భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి, ఎందుకంటే ఇవి ఆహారంలోని ఇనుము శోషణను అడ్డుకుంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం:-ఆకుకూరలు, బీట్‌రూట్, దానిమ్మ, ఉసిరి, జామకాయ, పప్పుధాన్యాలు, గుడ్లు మరియు పాలు వంటి ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ధూమపానం మరియు మద్యపానం అలవాట్లను పూర్తిగా మానివేయడం చాలా మంచిది. ప్రతిరోజూ తగినంత సమయం నిద్రపోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రక్తాభివృద్ధి సాధించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.

తెలంగాణలో యాసంగి సాగు ఆశాజనకం: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ పుంజుకోనున్న పంటల విస్తీర్ణం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు