Homeజాతీయంవర్షపాతంతో వణికిపోతున్న చెన్నై

వర్షపాతంతో వణికిపోతున్న చెన్నై

ఈశాన్య రుతుపవనాల తీవ్ర ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు ఉన్న 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం గమనార్హం. 2023లో సంభవించిన మిగ్‌జామ్ తుఫాను తర్వాత చెన్నై నగరంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ భారీ వర్షాల కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు, నీటి ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే 24 గంటల్లో కూడా పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే చెన్నై పరిధిలోనూ అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను యంత్రాంగం వేగవంతం చేసింది.

బతుకమ్మ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు