ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: రాజస్థాన్ రాష్ర్టంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న మిని బస్సు లోయపడి పడి 8 మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. కోటా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి లోతైన కాలువలో పడిపోవడంతో సుమారు 8మంది చనిపోగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆలయానికి వెళ్తున్న క్రమంలో ఘటన…
ప్రమాదానికి గురైన మినీ బస్సులో మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరు రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తున్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న సమయంలో మినీ బస్సు అదుపుతప్పి సుమారు 15 అడుగుల లోతున్న కాలువలో పడిపోయింది. వాహనంలో సుమారు 25 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కకున్నవారిని బయటకు తీసి గాయపడిన వారిని కోటాలోని కోటాలోని న్యూ మెడికల్ కాలేజీ హాస్పిటల్, ఎంబీఎస్ హాస్పిటల్‌కు తరలించారు. బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం లేదా వాహనం వేగంగా ప్రయాణించడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇవి కూడ చదవండి:
-
నల్లగొండ జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు..!
-
మ్యాట్రిమొనీ సైట్లో నకిలీ ప్రొఫైల్.. మహిళా కానిస్టేబుల్‌కు ప్రేమ వల వేసి రూ.1.10 లక్షలు స్వాహా!
-
ముంబైలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి 18 నెలల చిన్నారిని తోసేసిన పదేళ్ల బాలిక!
-
బంగాళాదుంప కూర వడ్డించిందని భార్యపై భర్త దాడి.. రాయితో తలపై బాది హత్యాయత్నం!
